Tuesday, October 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాష్ట్ర లీగల్ సేల్ సలహాదారునిగా కొండా భాస్కర్

రాష్ట్ర లీగల్ సేల్ సలహాదారునిగా కొండా భాస్కర్

- Advertisement -

నవతెలంగాణ – వనపర్తి
శ్రీ వాసవి సేవా సమితి తెలంగాణ రాష్ట్ర లీగల్ సేల్ అడ్వైజర్ కమిటీ కన్వీనర్ గా వనపర్తి పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది కొండ భాస్కర్ ను నియమిస్తున్నట్టు శ్రీ వాసవి సేవా సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు డాక్టర్ పూరి సురేష్ శెట్టి తెలిపారు. ఈ నియామక పత్రం శ్రీ వాసవి సేవా సమితి జాతీయ లీగల్ గౌరవ ముఖ్య సలహాదారులు రిటైర్డ్ జడ్జి సుప్రీం కోర్ట్ న్యాయవాది నేరెళ్ల మాల్యాద్రి చేతుల మీదుగా నియామక పత్రం ఇవ్వడం జరిగినది. ఈ సందర్భంగా కొండ భాస్కర్ న్యాయవాది మాట్లాడుతూ.. నాకు ఈ అవకాశం కల్పించిన టువంటి శ్రీ వాసవి సేవా సమితి జాతీయ గౌరవ చైర్మన్ మాజీ రాజ్యసభ సభ్యులు టీజీవెంకటేష్ గారికి డాక్టర్ పూరి సురేష్ శెట్టి గారికి మరియు మాల్యాద్రికి కృతజ్ఞతలు శ్రీ వాసవి సేవా సమితికి నా ద్వారా నా వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేయుచున్నాను. ఈ కార్యక్రమంలో న్యాయ సలహాదారులు మల్యాల రాజ్ కుమార్ గోవింద గుప్తా పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -