Tuesday, July 8, 2025
E-PAPER
Homeబీజినెస్ఆరు నగరాల్లో మెట్రో ట్రైన్స్ ద్వారా బ్రాండింగ్ క్యాంపెయినింగ్ కు సిద్ధమైన కొనికా మినోల్టా

ఆరు నగరాల్లో మెట్రో ట్రైన్స్ ద్వారా బ్రాండింగ్ క్యాంపెయినింగ్ కు సిద్ధమైన కొనికా మినోల్టా

- Advertisement -

డిజిటల్ ప్రొడక్షన్ ప్రింటింగ్ వ్యాపారంలో దిగ్గజంగా నిలుస్తోన్న కొనికా మినోల్టా బిజినెస్ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్  లిమిటెడ్ సంస్థ దేశవ్యాప్తంగా బ్రాండ్ మార్కెటింగ్ చేసేందుకు మరోసారి ముందుకొచ్చింది. మెట్రో రైళ్లలో క్యాంపెయినింగ్ చేసేందుకు నిర్ణయించుకుంది. ఈ మేరకు దిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై మరియు కలకత్తా వంటి ఆరు నగరాలను ఎంచుకుంది.

ఈ ఏడాది ప్రారంభంలో దిల్లీ, ముంబయిలో జరిపిన క్యాంపెయిన్ విజయవంతం అయినందున రెండో సారి తమ బ్రాండ్ మార్కెటింగ్ చేసేందుకు సిద్ధమైంది. తాము ఎంచుకున్న ఆరు సిటీల్లోని 7 మెట్రో రైళ్లను ఈ క్యాంపెయిన్ లో భాగం చేయనుంది. జూన్ 23న దిల్లీ మరియు ముంబయిలో రెండో దఫా క్యాంపెయిన్ ప్రారంభించి మిగతా నగరాల్లో కొనసాగించనుంది.

కలిసికట్టుగా, కొత్త అడుగులు వేస్తూ’, ‘ఇండియా ప్రింట్స్ ఆన్ కొనికా మినోల్టా వంటి క్యాంపెయిన్ సారాంశంతో మెట్రో రైళ్ల లోపల మరియు వెలుపల బ్రాండింగ్ చేయనున్నారు. సిటీ అంతా కనిపించేలా మెట్రో రైలు వెలుపల డిజైన్ ఉండగా.. ప్రయాణికులకు, కొనికా మినోల్టా గురించి పూర్తి స్థాయిలో అర్థమయ్యేలా మెట్రో లోపల డిజైన్స్ ఉండటం గమనార్హం. 

ఈ సందర్భంగా కొనికా మినోల్టా బిజినెస్ సొల్యూషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ కట్సుహిసా అన్సారి మాట్లాడారు. “ఈ బ్రాండింగ్ క్యాంపెయిన్ ద్వారా దేశంలోని మెట్రో నగరాల్లో సరికొత్త బ్రాండింగ్ కు బాటలు వేస్తున్నాం. మేం బ్రాండింగ్ చేసేందుకు ఎంచుకున్న ప్రతీ ట్రైన్, మొబైల్ షో కేస్ లా అందంగా కనిపించనుంది. మా వినియోగదారులకు, వ్యాపార భాగస్వాములకు భారత్ లో మేం మరింత విస్తరించబోతున్నాం అనే సంకేతాన్ని ఇస్తుంది. భవిష్యత్తు వ్యాపార అవసరాలకు అనుగుణంగా, మరింత సాంకేతికతతో ముందుకు వస్తున్నాం అనే విషయం అర్థమవుతుంది.” అని అన్నారు.

డిజిటల్ ఓఓహెచ్, వన్ పవర్ హౌస్ మరియు ప్రింట్ ఎక్స్ ప్రెస్ వంటి విలువైన బ్రాండింగ్ కార్యక్రమాలు చేసినా ఈ సరికొత్త మెట్రో బ్రాండింగ్ చొరవ కొనికా మినోల్టా చరిత్రలో ఒక మైలు రాయిగా నిలువనుంది. 

డిజిటల్ ప్రింటింగ్ కు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో కొనికా మినోల్టాకు కూడా మరింత ప్రాధాన్యం పెరుగుతోంది. ఎన్నో లక్షల మందికి, వ్యాపారస్థుల నమ్మకాన్ని నిలపడంలో కొనికా సంస్థ కృషి చేస్తూ ముందడుగు వేస్తోంది. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -