– బీహార్‌లో ఎన్నికల కమిషన్ గెలిచిందంటూ విమర్శ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ విజయం పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు హర్షం వ్యక్తం చేశారు. విజ్ఞతతో ఓటు వేసిన ఓటర్లకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజాసమస్యల పరిష్కారం అంశంపై ప్రజలు ఓటేశారని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి స్వయంగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ గల్లంతు అయ్యిందని విమర్శించారు. సానుభూతిపై బీఆర్‌ఎస్ ఆశలు పెట్టుకున్నా అది పనిచేయలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఘనవిజయం ప్రజావిశ్వాసాన్ని సూచిస్తున్నదని తెలిపారు. విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు సీపీఐ మద్దతు తెలపడమే కాకుండా ప్రచారం కూడా చేశామని గుర్తుచేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిది కాదు..ఎన్నికల సంఘానిదే గెలుపు అంటూ విమర్శించారు. ఎన్నికల ముంగిట ఆ రాష్ట్రంలో 75 లక్షల మంది మహిళల బ్యాంకు ఖాతాల్లో నితీష్‌కుమార్ ప్రభుత్వం రూ. 10 వేల నగదు బదిలీ చేసినా ఎన్నికల సంఘం ఏమాత్రం పట్టించుకోలేదని ఎత్తిచూపారు. ఎస్‌ఐఆర్ పేరిట 65 లక్షల ఓట్లు తొలగించారని గుర్తుచేశారు. ఇవ్వన్ని కూడా ఎన్‌డిఎ కూటమి విజయానికి దోహదం చేశాయని అభిప్రాయపడ్డారు. న
నవీన్‌యాదవ్ గెలుపు పట్ల కూనంనేని హర్షం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



