సీపీఐ అభ్యర్థి దండు వెంకటరమణ టీవీ రిమోట్ గుర్తుపై ఓటేసి గెలిపించండి
నవతెలంగాణ – మునుగోడు
కొరటికల్ గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ఆశీర్వదించాలని సిపిఐ అభ్యర్థి దండు వెంకటరమణ గ్రామ ప్రజలను కోరారు. శుక్రవారం గ్రామంలోని పలు వార్డులలో గ్రామ ప్రజల్ని కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తమను గెలిపిస్తే గ్రామానికి చేపట్టే అభివృద్ధి పనులపై గ్రామ ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నించే గొంతుగా ప్రజల పక్షాన పోరాడి గ్రామ అభివృద్ధి కోసం వస్తున్న తమ ను గెలిపించాలని కోరారు. దండు వెంకటరమణ, మందల పాండు, మిరియాల యాదయ్య, దండు యాదయ్య , కురుపటీ వెంకన్న , అరకంటి చంద్రశేఖర్ తదితరులున్నారు.
కొరటికల్ ను ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేస్తా..
- Advertisement -
- Advertisement -



