తీగల ఆగిరెడ్డి తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు
నవతెలంగాణ – గోవిందరావుపేట
రైతు సంఘం ఆధ్వర్యంలో కోటకాల్వ పరిశీలన లక్నవరం చెరువు పరిధిలోని కోట కాలువ పూటికతీత పనులు వెంటనే చేపట్టాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తీగల ఆదిరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం తెలంగాణ రైతు సంఘం గోవిందరావుపేట మండల కమిటీ ఆధ్వర్యంలో కోట కాలువ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆది రెడ్డి మాట్లాడుతూ కోట కాలువ మొత్తం గడ్డి చెత్తాచెదారంతో నిండిపోయిందని అన్నారు దీంతో రైతులు పొలాలకు సాగునీరు అందక ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ కాల్వ కింద సుమారు 2500 ఎకరాలు కాస్త లో ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం రైతులకు సాగునీరు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు కాల్వ లోని పూడికతీత పనులు చేపట్టకపోవడంతో నీరు వృధాగా సల్లరలో డ్రాప్ పై నుండి నీరు వృధాగా పోతుందని అన్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా కాలువలను పట్టించుకోలేదని ఇప్పుడున్న ప్రభుత్వం కూడా రైతులకు సాగునీరు అందించడంలో పూర్తిగా విఫలం చెందిందని మండిపడ్డారు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కాలువలు మరమ్మత్తులు చేపడతామని హామీ ఇచ్చి విస్మరించారని ఆరోపించారు .
ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే కోట కాలువ పూడికతీత పనులు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.లేనియెడల తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు సోమ మల్లారెడ్డి పొదిల్లా చిట్టిబాబు సప్పిడి ఆదిరెడ్డి,యానాల ధర్మారెడ్డి, కడారి నాగరాజు , తదితరులు పాల్గొన్నారు.
కోట కాలువ పూడికతీత పనులు వెంటనే చేపట్టాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES