నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
గవర్నమెంట్ టీచర్స్ అసోసియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా నూతన అధ్యక్షునిగా పాశం కృష్ణమూర్తి ఎన్నికైనట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కిషోర్ కుమార్ తెలిపారు. శనివారం భువనగిరి లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (జూనియర్ కళాశాలలో) టీజీఏ సమావేశం నిర్వహించగా, జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. గౌరవ అధ్యక్షులుగా వెంకటరమణ, ఉపాధ్యక్షులుగా ఎంఏ సలీం, ఆర్ సవిత, ఏం ఆనందరావు, ప్రధాన కార్యదర్శిగా ఎన్ లింగయ్య, సంయుక్త కార్యదర్శిగా కే మల్లేష్, వి శ్యాంసుందర్, ఎన్ సుదర్శన్ రెడ్డి, ఆర్థిక కార్యదర్శిగా సుధాకర్, మహిళా కార్యదర్శిగా ప్రతిభ, జిల్లా కార్యవర్గ సభ్యులుగా కే వెంకటేశం, కళ్యాణి,నాగరాజు, నరసింహ, ఎం.డి అజిజ్, హిమబిందు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సైదులు రెడ్డి, గౌరవ అధ్యక్షులు ప్రభాకర్ కోశాధికారి ప్రవీణ్ కుమార్, మీనాక్షి పాల్గొన్నారు.
గవర్నమెంట్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షునిగా కృష్ణమూర్తి ఎన్నిక..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES