- Advertisement -
నవతెలంగాణ- నిజామాబాద్ సిటీ
నిజాంబాద్ నగరంలోని న్యాల్కల్ రోడ్డులో గల లండన్ కిడ్స్ పాఠశాలలో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మౌనిక మెహర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని, దీనివలన విద్యార్థులకు సాంప్రదాయలు తెలిసే విధంగా చేశామన్నారు. విద్యార్థులకు గోపిక, కృష్ణుడి వేషధారణలో చూడటం అందరినీ అలరించారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అన్నపూర్ణ, రమ్య, సుజాత తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -