- Advertisement -
నవతెలంగాణ – పెద్దవూర
మండల కేంద్రం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల విద్యాధికారి తరి రాము ఆధ్వర్యంలో బుధవారం ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో విద్యార్థులు గోపికలుగా, విద్యార్థులు కృష్ణుడిగా వేశ్యదరణ నృత్యాలతో విద్యార్థులను ఆకట్టుకుంది. విద్యార్థులు అందరూ సంబరంగా సంతోషంగా జరుపుకున్నారు. అభిరామ్ అనే విద్యార్ది కృష్ణుడి వేషదారణ లో, ఆరో తరగతి బాలికలు గోపికల వేష దారణలో విద్యార్థులను,ఉపాధ్యాయనీ,ఉపాధ్యాయులను ఎంతగానోఆకట్టు కున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాలఉపాధ్యాయులు రమాదేవి, అభిషేక్,చంద్రమణి,చంద్రకళ, మేరెమ్మ,లలిత, కృష్ణయ్య, అనిల్,వాల్య,శంకర్ పాల్గొన్నారు.
- Advertisement -