- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామపంచాయతీ పరిధిలోని రామారావు పల్లి, ఎస్సీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ముందస్తుగా గురువారం శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థిని, విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో వారు చెసిన నృత్యాలు, ఆటపాటలు పలువురిని అలరించాయని రామారావు పల్లి పాఠశాల హెచ్ఎం బి. పద్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెడ్మాస్టర్ సి.హెచ్ తిరుపతి, ఎస్సీ కాలనీ ప్రధానోపాధ్యాయుడు డబ్ల్యూ.అరుణ్ కుమార్, ఆప్ చైర్మన్ బి.సరిత, ఉపాధ్యాయులు బి.కవిత, సురేష్, కవిత, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -