నవతెలంగాణ – తాడ్వాయి
రాష్ట్ర కాబినెట్ లో బీసీ రిజర్వేషన్ 42% పెంచినందుకు సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కు కు, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్, పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క లకు శుక్రవారం మేడారంలో వారి చిత్రపటాలకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంచాయతీరాజ్ చట్టం 2018లో తీసుకొచ్చిన చట్టాన్ని త్వరలోనే సవరించాలని, దీంతో పాటు ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో గురువారం సమావేశమైన క్యాబినెట్ తీర్మానించిందని అన్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసి స్థానిక సంస్థలకు పోవాలని క్యాబినెట్లు నిర్వహించినట్లు, ఇది మంచి శుభ పరిణామం, కాంగ్రెస్ పార్టీ బీసీలకు పెద్దపీట వేసిందని వారు అన్నారు. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్, ఉపాధ్యక్షులు ఇప్ప నాగేశ్వరావు, గౌరవ అధ్యక్షులు అనంతరెడ్డి, సీతక్క యువసేన అధ్యక్షులు చెర్ప రవీందర్, బీసీ సెల్ అధ్యక్షులు మల్లయ్య, కిసాన్ సెల్ అధ్యక్షులు రవి ఎస్టీ సెల్ అధ్యక్షులు మంకిడి ప్రశాంత్, మాజీ ఎంపీటీసీ బత్తిని రాజు, మాజీ సర్పంచ్ బెజ్జూర్ శ్రీను, పులి రవి, మంకిడి నరసింహస్వామి, దుర్గయ్య, మద్దూరి రాజు, పాలకుర్తి మధు, పాక రాజేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES