- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: నారాయణపేట జిల్లాలో సీఎం రేవంత్ చేసిన ప్రసంగంపై కేటీఆర్ మండిపడ్డారు. ‘‘నీటి ద్రోహంపై జవాబు చెప్పలేక నికృష్టపు మాటలా?జలహక్కులను కాపాడటం రేవంత్‌రెడ్డికి చేతకాదు. పాలమూరు ప్రాజెక్టు గొంతుకోసి సొంత జిల్లానే దగా చేస్తున్నారు. తెలంగాణ సోయిలేని, రాష్ట్ర ప్రయోజనాలను రక్షించలేని వ్యక్తి. అడ్డంగా దొరకడం, ఆగమాగమై అడ్డదిడ్డంగా మట్లాడటం.. పనికిమాలిన శపథాలు చేయడం, పత్తాలేకుండా పారిపోవడం సీఎంకు అలవాటేనని’’ అన్నారు.
- Advertisement -



