Sunday, December 14, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరామేశ్వరం కేఫ్‌లో అఖిలేశ్‌యాదవ్‌తో కేటీఆర్‌ భోజనం

రామేశ్వరం కేఫ్‌లో అఖిలేశ్‌యాదవ్‌తో కేటీఆర్‌ భోజనం

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
హైదరాబాద్‌లోని రామేశ్వరం కేఫ్‌లో ఎస్పీ అధినేత, ఎంపీ అఖిలేశ్‌ యాదవ్‌తో కలిసి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ భోజనం చేశారు. హైదరాబాద్‌లో ఎంతో ఆదరణ పొందిన ఆ కేఫ్‌లో రుచుల గురించి అక్కడ లభించే ప్రత్యేకమైన టిఫిన్ల గురించి అఖిలేశ్‌యాదవ్‌ అడిగి తెలుసుకున్నారు. ఈ విందులో ఇరువురు నేతలు దక్షిణాది రుచులను ఆస్వాదించారు. పలు రాజకీయ, సమకాలీన అంశాలపై ముచ్చటించారు. వారి రాక సందర్భంగా రామేశ్వరం కేఫ్‌ యజమాని శరత్‌ ఘనస్వాగతం పలికారు. అక్కడి వంటకాలను రుచి చూసిన అఖిలేశ్‌ యాదవ్‌ వాటి నాణ్యతను, రుచిని ప్రత్యేకంగా అభినందించారు. హైదరాబాద్‌లో రామేశ్వరం కేఫ్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్న శరత్‌కు, ఆయన కుటుంబ సభ్యులను శుభాకాంక్షలు తెలిపారు.

తలసాని ఇంటికి అఖిలేశ్‌ యాదవ్‌
రామేశ్వరం కేఫ్‌లో భోజనం అనంతరం బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఇంటికి వెళ్లారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, సికింద్రాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గం ఇంచార్జీ తలసాని సాయి కిరణ్‌ యాదవ్‌, పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -