Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఆవంచలో శ్వేతారెడ్డి విగ్రహావిష్కరణ చేసిన కేటీఆర్, హరీష్ రావు

ఆవంచలో శ్వేతారెడ్డి విగ్రహావిష్కరణ చేసిన కేటీఆర్, హరీష్ రావు

- Advertisement -

నవతెలంగాణ – తిమ్మాజీపేట
మండలంలోని ఆవంచ గ్రామంలో మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతా రెడ్డి విగ్రహాన్నీ మంగళవారం మాజీ మాత్రులు కేటీఆర్ హరీష్ రావులు ఆవిష్కరించారు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతరెడ్డి అకాల మరణం చెందడంతో తన స్వగ్రామాల్లో ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె ఆవిష్కరించారు. అనంతరం స్థానిక వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారిని ఇద్దరు నేతలు దర్శించుకున్నారు. అనంతరం జడ్చర్ల లోని ప్రేమరంగ గార్డెన్ లో శ్వేతారెడ్డి ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి బయలుదేరుతూ మీకు అండగా మేమున్నామంటూ ప్రజలకు అభివాదం చేస్తూ వెళ్లారు. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, రజనీ సాయిచంద్, పార్టీ మండల అధ్యక్షులు జోగు ప్రదీప్ మాజీ జెడ్పిటిసి దయాకర్ రెడ్డి మాజీ సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు వేణుగోపాల్ మాజీ సర్పంచ్ అజయ్ కుమార్ మండలానికి చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad