- Advertisement -
నవతెలంగాణ – పెబ్బేరు
బీఆర్ఎస్ మాజీ మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ పెబ్బేరు మండల, శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. శనివారం సాయంత్రం గద్వాల జిల్లా కేంద్రంలో జరిగే బహిరంగ సభకు రోడ్డు మార్గాన వెళుతున్న కేటీఆర్ కు పెబ్బేరు బైపాస్ సమీపంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో మండల గులాబీ శ్రేణులు కండువా కప్పి ఘనంగా స్వాగతం పలికారు. కేటీఆర్ సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేశారు. తొందరలోనే వనపర్తికి వస్తానని కేటీఆర్ గులాబీ శ్రేణులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తో పాటు పెబ్బేరు పట్టణ మండల బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -