Saturday, July 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

- Advertisement -

ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా భువనగిరి పట్టణంలోని ప్రిన్స్ చౌరస్తా వద్ద ఆ పార్టీ పట్టణ, మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా  జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా భువనగిరి మాజీ ఏమ్మెల్యే  పైళ్ల శేఖర్ రెడ్డి హాజరై, కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేశారు.  అనంతరం భువనగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు, బ్రెడ్ పంపిణీ  చేశారు.ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ కేటీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ భువనగిరి నియోజకవర్గానికి 10 సంవత్సరాలు కేటీఆర్ హెచ్ఎండిఏ  నిధులను అత్యధికంగా ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. 

 భువనగిరి, పోచంపల్లి మున్సిపల్ లోని అన్ని వార్డులకు అండర్ గ్రౌండ్ డ్రైనేజి, సిసి రోడ్లకు భువనగిరి పట్టణంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు నిధులను ఇవ్వడం జరిగిందని అన్నారు.  తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఐటీ రంగంలో ముందు వరుసలో ఉంచారని కెసిఆర్, కేటీఆర్ నాయకత్వంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించే విధంగా కార్యకర్తలు నాయకులు అందరూ కష్టపడి కేటీఆర్ కి జన్మదిన కానుకగా భువనగిరి నియోజకవర్గం నుండి ఇద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో  మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, బిఆర్ఎస్ పార్టీ పట్టణ మండల అధ్యక్షులు ఏవి కిరణ్ కుమార్, జనగాం పాండు, పార్టీ పట్టణ, మండల ప్రధాన కార్యదర్శులు రచ్చ శ్రీనివాస్ రెడ్డి, నీల ఓం ప్రకాష్ గౌడ్, నాయకులు మాజీ జెడ్పిటిసి బీరు మల్లయ్య, నాయకులు అతికం లక్ష్మీనారాయణ గౌడ్, ఇట్టబోయిన గోపాల్, నువ్వుల సత్యనారాయణ, అబ్బగాని వెంకటేష్, కాజా అజిముద్దీన్, కడారి వినోద్, కుశంగల రాజు, చేన్న మహేష్, దిడ్డికాడి భగత్, తుమ్మల పాండు, బర్రె రమేష్, తాడూరు బిక్షపతి, వెల్దుర్తి రఘునందన్, జడల యాశిల్ గౌడ్,ఎక్బాల్ చౌదరి, కస్తూరి పాండు, కంచి మల్లయ్య, ర్యాకల శ్రీనివాస్, సుధాకర్, ఖాజాం, గాదె శ్రీనివాస్, ఇస్మాయిల్, ముజీబ్, కాలేరు లక్ష్మణ్, అంకర్ల మురళి, ధనుంజయ గౌడ్, పెంట నితీష్, నాగారం సూరజ్, యాస సంతోష్, శాగంటి నరసింహ, గుర్రాల శ్రీశైలం, సైదులు, ఇండ్ల శ్రీనివాస్, నర్సింగరావు, నిలగొండ శివ, మల్లికార్జున్, అశోక్, శ్రీశైలం,చిన్న,ప్రవీణ్, మధు, హీరేకర్ నాగరాజులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -