నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ మండల కార్యాలయం వద్ద ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. మండల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్ర నాయకులు బద్దం చిన్నారెడ్డి నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా బద్దం చిన్నారెడ్డి మాట్లాడుతూ మండల బిఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ భవిష్యత్తు ఆశ కిరణం కేటీఆర్ అని పేర్కొన్నారు.ఉద్యమ ప్రస్థానంలోనే కాకుండా
తెలంగాణ ఉజ్వల ప్రగతి ప్రస్థానంలోనూ కల్వకుంట్ల తారక రామారావు చెరగని ముద్ర వేశాడన్నారు. హైదరాబాద్ ను ఆర్థిక ప్రగతిలో అగ్రగామిగా తీర్చిదిద్దిన అలుపెరగని శ్రామికుడు కేటిఆర్ అని కొనియాడారు.కార్యక్రమంలో బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు కొంటి కంటి నరేందర్, తాజా మాజీ సర్పంచ్ లు గడ్డం స్వామి, మారు శంకర్, తాజా మాజీ ఎంపీటీసీ సభ్యులు మైలారం సుధాకర్, పిప్పెర అనిల్, బిఆర్ఎస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు లుక్క గంగాధర్, అహ్మద్ హుస్సేన్, నాయకులు బద్దం భాస్కర్ రెడ్డి, పాలెపు రవి కిరణ్, అమరగొని సదాశివ గౌడ్, కొత్తపల్లి రఘు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.