Sunday, December 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తెలంగాణ సర్కిల్ ఆర్గనైజ్ సెక్రటరీగా కూడుదుల కిష్టయ్య 

తెలంగాణ సర్కిల్ ఆర్గనైజ్ సెక్రటరీగా కూడుదుల కిష్టయ్య 

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
బ్రిటిష్ గవర్నమెంట్ పెట్టే చట్టాలు ఇప్పటికీ అమలులో ఉన్నవని, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే కార్మికులకు న్యాయం జరగలేదని కుడుదుల కిష్టయ్య అన్నారు. తెలంగాణ సర్కిల్ ఆర్గనైజ్ సెక్రటరీగా కుడుదుల కిష్టయ్య ఆదివారం సూర్యాపేటలో జరిగిన ఐదవ ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవకు  తెలంగాణ సర్కిల్ ఆర్గనైజ్ సెక్రెటరీగా నియామకం అయినా అనంతరం ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తపాల శాఖలో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే కార్మికులకు న్యాయం జరగలేదని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లో ఎన్నో సేవలు చేస్తున్న ఈ గ్రామీణ సేవకులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని తెలిపారు. ఈ అవకాశం ఇచ్చినందుకు తోటి గ్రామీణ సేవకులకు అన్నివేళల్లో ఉండి సేవలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా గ్రామీణ డాగ్ సేవక్ ఆల్ ఇండియా కార్యదర్శి మహాదేవ పాల్గొన్నారు.

 ఇతర రాష్ట్రాల నుండి యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -