Tuesday, August 19, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుకూక‌ట్‌ప‌ల్లి బాలిక హ‌త్య‌కేసు: పోలీసుల అదుపులో ఓ యువ‌కుడు

కూక‌ట్‌ప‌ల్లి బాలిక హ‌త్య‌కేసు: పోలీసుల అదుపులో ఓ యువ‌కుడు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: కూక‌ట్‌ప‌ల్లి బాలిక హ‌త్య‌కేసులో ద‌ర్యాప్తును పోలీసులు ముమ్మ‌రం చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా.. చుట్టుపక్కల ఉన్న వందల సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. చివరకు హత్య జరిగిన అదే భవనంలో ఉంటున్న ఓ యువకుడు అక్కడక్కడే సంచరించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

కూకట్‌పల్లిలోని దయార్‌గూడలో 11 ఏళ్ల బాలిక సహస్రిని దారుణహత్య రాష్టవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఒంటరిగా ఇంట్లో ఉన్న బాలిక గొంతుకోసి.. ఆపై కడుపులో పొడిచి కిరాతకంగా హత్య చేశారు. అయితే ఈ కేసు దర్యాప్తులో భాగంగా.. చుట్టుపక్కల ఉన్న వందల సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. కూకట్‌పల్లి బాలిక హత్య కేసులో సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు జరుపుతున్న పోలీసులు.. అదే బిల్డింగ్‌లో అద్దెకు ఉంటున్న ఓ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad