యుఎఇపై తొమ్మిది వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం
ఆసియాకప్ క్రికెట్ టోర్నీ
దుబాయ్: టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ మాయాజాలానికి తోడు శివమ్ దూబే ఆల్‌రౌండ్ ప్రతిభ, హైదరాబాద్ బ్యాటర్ అభిషేక్ శర్మ ధనా ధన్ బ్యాటింగ్.. వెరసి ఆతిథ్య యునైటెడ్ అరబ్ ఎమిరేట్(యుఎఇ)పై భారత్ ఘన విజయం సాధించింది. తొలుత టీమిండియా స్పిన్నర్లు సమిష్టిగా చెలరేగడంతో యుఎఇ జట్టును కేవలం 57పరుగులకే ఆలౌట్ చేసి.. ఆ లక్ష్యాన్ని భారతజట్టు 4.3 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి సునాయాసంగా ఛేదించి బోణీ కొట్టింది. ఆసియాకప్ టోర్నీలో భాగంగా బుధవారం జరిగిన గ్రూప్-ఎ తొలి లీగ్ మ్యాచ్‌లో ఆతిథ్య యుఎఇ జట్టుపై భారతజట్టు 9వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత యుఎఇని 13.1 ఓవర్లలో 57పరుగులకే ఆలౌట్ చేయడంతో న్యూజిలాండ్ చేతిలో 2003లో 66పరుగులకు ఆలౌటైన చెత్త రికార్డును యుఎఇ టీమిండియాపై నెలకొల్పింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు శుభారంభం లభించింది. ఓపెనర్లు అలీషాన్(22), కెప్టెన్ వాసీమ్(19) కలిసి తొలి వికెట్‌కు 26పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ ఔటయ్యాక యుఎఇ జట్టు బ్యాటర్లు ఇలా వచ్చి అలా వెళ్లారు. ఆ తర్వాత వచ్చిన 8మంది బ్యాటర్లు కనీసం మూడంటే మూడు పరుగుల స్కోర్‌ను కూడా కొట్టలేకపోయారు.
తొలి వికెట్ 26పరుగుల వద్ద కోల్పోయిన యుఎఇ జట్టు మో 31పరుగులకు మిగిలిన 9వికెట్లను కోల్పోవడం విశేషం. మరోవైపు టీమిండియా మిస్టరీ స్పిన్నర్లు కుల్దీప్(4/7), దూబే(3/4), వరుణ్ చక్రవర్తి(1/4) యుఎఇ బ్యాటర్లను పెవీలియన్‌కు పంపడంలో సఫలీకృతులయ్యారు. టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆతిథ్య జట్టుపై ఎలాంటి ప్రయోగాలకు తావులేకుండా బలీయ జట్టుతోనే భారత్ బరిలోకి దిగింది. హార్దిక్, దూబే, అక్షర్ ఆల్‌రౌండర్లకు తోడు పేసర్ల కోటాలో బుమ్రా, స్పిన్నర్ల కోటాలో వరుణ్, కుల్దీప్‌లతో భారతజట్టు బరిలోకి దిగింది.
స్కోర్‌బోర్డు :
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇన్నింగ్స్: ఆలీషాన్ (బి)బుమ్రా 22), వాసీం (ఎల్‌బి)కుల్దీప్ 19, ముహమ్మద్ (సి)కుల్దీప్ (బి)వరుణ్ చక్రవర్తి 2, రాహుల్ చోప్రా (సి)శుభ్‌మన్ (బి)కుల్దీప్ 3, ఆసిఫ్ ఖాన్ (సి)సంజు (బి)దూబే 2, హర్షీత్ (బి)కుల్దీప్ 2, ధృవ్ పరషార్ (ఎల్‌బి)దూబే 1, సిమ్రన్‌జీత్ (ఎల్‌బి)అక్షర్ 1, హైదర్ అలీ (సి)సంజు (బి)కుల్దీప్ 1, జునైద్ (సి)సూర్యకుమార్ (బి)దూబే 0, రోహిద్ ఖాన్ (నాటౌట్) 2, అదనం 2. (13.1ఓవర్లలో ఆలౌట్) 57పరుగులు.
వికెట్ల పతనం: 1/26, 2/29, 3/47, 4/48, 5/50, 6/51, 7/52, 8/54, 9/55, 10/57
బౌలింగ్: హార్దిక్ పాండ్యా 1-0-10-0, బుమ్రా 3-0-19-1, అక్షర్ 3-0-13-1, వరణ్ చక్రవర్తి 2-0-4-1, కుల్దీప్ 2.1-0-7-4, దూబే 2-0-4-3.
ఇండియా ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (సి)హైదర్ అలీ (బి)జునైద్ సిద్ధిక్ 30, శుభ్‌మన్ (నాటౌట్) 20, సూర్యకుమార్ యాదవ్ (నాటౌట్) 7, అదనం 3. (4.3ఓవర్లలో వికెట్ నష్టపోయి) 60 పరుగులు.
వికెట్ల పతనం: 1/48
బౌలింగ్: హైదర్ అలీ 1-0-10-0, మహ్మద్ రోహిద్ 1-0-15-0, ధృవ్ పరషార్ 1-0-13-0, జునైద్ సిద్ధిఖీ 1-0-16-1, సిమ్రన్‌జీత్ సింగ్ 0.3-0-6-0.