- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కర్నూలు బస్సు ప్రమాదంలో మరణించిన బైకర్ శివశంకర్‌పై అతని స్నేహితుడు ఎర్రిస్వామి పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. శివశంకర్ నిర్లక్ష్యం వల్లే బైక్ డివైడర్‌ను ఢీకొట్టినట్లు ఫిర్యాదులో ఎర్రిస్వామి పేర్కొన్నాడు. ‘‘బైక్ డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరం పడిపోయాం. శివశంకర్ ఘటనాస్థలిలోనే మృతి చెందాడు. మృతదేహాన్ని పక్కకు తీసేందుకు యత్నించా. ఇంతలో మా బైక్‌ను ఓ వాహనం ఢీకొట్టగా రోడ్డు మధ్యలోకి వచ్చింది. అనంతరం వీ కావేరి ట్రావెల్స్ బస్సు బైక్‌ను లాక్కెళ్లింది’’ అని వివరించాడు.
- Advertisement -


