అంగన్‌వాడీలను కార్మిక చట్టాల పరిధిలోకి తేవాలి
9న జరిగే సమ్మెను జయప్రదం చేయాలి : తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ)
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్రంలో మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్‌లను రద్దు చేయాలనీ, అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లను కార్మిక చట్టాల పరిధిలోకి తేవాలని తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.సునీత, పి.జయలక్ష్మి డిమాండ్ చేశారు. లేబర్‌కోడ్‌ల రద్దు కోరుతూ ఈ నెల 9న దేశవ్యాప్తంగా తలపెట్టిన సార్వత్రిక సమ్మెలో అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆ యూనియన్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఐసీడీఎస్‌లను ప్రయివేటీకరించడాన్ని ఆపాలనీ, అంగన్‌వాడీలకు కనీసవేతనం, ఉద్యోగభద్రత, తదితర సమస్యలను పరిష్కరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి పి.మంగ, ఆఫీస్ బేరర్లు వెంకటమ్మ, స్వప్న, సమ్మక్క, సునీత, శారద, ఏమెలమ్మ, ఆ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.
లేబర్‌కోడ్‌లను రద్దు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES