Monday, July 28, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంకార్మిక చట్టాలను కాలరాస్తున్నారు

కార్మిక చట్టాలను కాలరాస్తున్నారు

- Advertisement -

దక్షిణాఫ్రికా ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న నిరసనలు
ఆందోళనకు సమాయత్తం
కేప్‌టౌన్‌ :
దక్షిణాఫ్రికా ప్రభుత్వం కార్మిక చట్టాలను కాలరాస్తోందని కార్మిక సంఘాలు, పౌర సమాజ గ్రూపులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చట్టానికి 65 సవరణలు ప్రతిపాదించారని అంటూ ఎలాంటి విచారణ జరపకుండానే కార్మికులను విధుల నుంచి తొలగించేందుకు, క్యాజువల్‌ కార్మికుల సంఖ్యను పెంచేందుకు, పెద్ద ఎత్తున ఉద్యోగులను ఇంటికి సాగనంపేందుకు, వ్యాపారాలను దెబ్బతీయడానికి ఔట్‌సోర్సింగ్‌ విధానాలను అమలు చేసేందుకు వాటిని ఉద్దేశించారని ధ్వజమెత్తాయి. ఈ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు 40 సంఘాలు సమాయత్తమవుతున్నాయి. సవరణ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ కార్మికులు ఈ నెల 22న నేషనల్‌ ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ లేబర్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఈడీఎల్‌ఏపీ) ఎదుట ప్రదర్శన నిర్వహించి శంఖారావాన్ని పూరించారు. కార్మిక సంఘాల ఐక్య వేదికలో వ్యవసాయ కార్మికులు, మహిళలు, మానవ హక్కుల కార్యకర్తలకు సంబంధించిన 40 సంఘాలు భాగస్వాములుగా ఉన్నాయి. ఎన్‌ఈడీఎల్‌ఏపీ ప్రతిపాదించిన సవరణలన్నీ కార్మికులను ఇబ్బంది పెట్టేవేనని, ముఖ్యంగా మహిళలు, యువత, వలసదారులు, ప్రొబేషన్‌పై ఉన్న వారు తీవ్రంగా నష్టపో తారని ఐక్య వేదిక తెలిపింది. మూడు నెలల ప్రొబేషన్‌ కాలంలో ఉద్యోగులను యాజమాన్యాలు ముప్పుతిప్పలు పెట్టే అవకాశం ఉన్నదని వివరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -