Saturday, September 13, 2025
E-PAPER
Homeఖమ్మంవాగులో చిక్కుకున్న కూలీలు

వాగులో చిక్కుకున్న కూలీలు

- Advertisement -

– గాలింపు చేపట్టిన పోలీసులు
– ఇరువురు గల్లంతు
నవతెలంగాణ – అశ్వారావుపేట

వ్యవసాయ పనులకు వెళ్ళిన ఆరుగురిలో నలుగురు వాగులో చిక్కుకొని ఇరువురు ఒడ్డుకు చేరుకోగా ఇరువురు గల్లంతు అయ్యారు. స్థానికులు కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కావడి గుండ్ల పంచాయితీ గోపన్నగూడెం – కావడిగుండ్ల మధ్య వాగు లో గుబ్బల మంగమ్మ వాగు వంతెన దిగువ భాగం లో శనివారం పత్తి సాగులో పనిచేస్తుండగా ఉదృతంగా వచ్చిన వరదలో నలుగురు మహిళా కూలీలు  కొట్టుకు పోయారు.ఇందులో ఇరువురు ఒడ్డుకు చేరుకోగా ఇరువురు గల్లంతు అయ్యారు.

ఆంధ్రప్రదేశ్,జీలుగుమిల్లి పూచిక పాడు గ్రామానికి చెందిన పాలడుగుల చెన్నమ్మ,పచ్చితల వరలక్ష్మి మరో నలుగురితో కలిసి మొత్తం ఆరుగురు తెలంగాణ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,కావడి గుండ్ల పంచాయితీ చెన్నాపురం కూలి పనులకు వచ్చి తిరిగి వెళుతుండగా ఘటన చోటుచేసుకుంది. మొత్తం నలుగురు కొట్టుకు పోగా క్షేమంగా ఇద్దరు బయటపడ్డారు.గల్లంతయిన చెన్నమ్మ, వరలక్ష్మి ఆచూకీ కోసం ఆంధ్రప్రదేశ్ జీలుగుమిల్లి,తెలంగాణ అశ్వారావుపేట పోలీస్ లు గాలింపు చర్యలు చేపట్టినట్లు అశ్వారావుపేట ఎస్.హెచ్.ఓ యయాతి రాజు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -