- Advertisement -
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హైదరాబాద్ గచ్చిబౌలిలోని మెడికవర్ ఆస్పత్రిని శనివారం ఉద్యోగ జేఏసీ చైర్మెన్ వి లచ్చిరెడ్డి సందర్శించారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి వందన కుమారుడు తీవ్రమైన అనారోగ్యంతో తక్షణమే సర్జరీ అవసరమైన పరిస్థితిలో ఉన్నందున, ఆమెకు ఆర్థిక సహాయాన్ని అందించడంతోపాటు, అవసరమైన సహాయం అందించేందుకు ఆస్పత్రి యాజమాన్యంతో ఆయన మాట్లాడారు. వారిపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా ఆస్పత్రి యాజమాన్యాన్ని ఒప్పించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ జేఏసీ నాయకులు పాక రమేష్, రామకృష్ణ, మల్లేషం తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -


