Friday, October 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ లో సమన్వయ లోపం.. అవాస్తవం: ధరాస్ సాయిలు

కాంగ్రెస్ లో సమన్వయ లోపం.. అవాస్తవం: ధరాస్ సాయిలు

- Advertisement -

జుక్కల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కార్యకర్తలకు అండ
విలేకరుల సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు దరాస్ సాయిలు
నవతెలంగాణ – మద్నూర్

జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో సమన్వయ లోపం ఉన్నట్లు పత్రికల్లో వస్తున్న ఆరోపణలు అవాస్తవమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధరాస్ సాయిలు తెలిపారు. జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు కార్యకర్తల పట్ల పట్టించుకోవడం లేదని ఆరోపణలు నిజం లేదని, కార్యకర్తలకు ఎమ్మెల్యే ఎంతో అండగా ఉన్నారని అన్నారు. ప్రతిపక్షాలు ఊహించుకునే విధంగా కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని, స్థానిక సంస్థలు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు నాయకత్వంలో పూర్తి మెజారిటీని సాధిస్తామని పేర్కొన్నారు.

సలబత్పూర్ ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ రామ్ పటేల్ రాజీనామాకు సిద్ధమవుతున్నట్లు పత్రికల్లో వచ్చే వార్తలు అవాస్తవమని అన్నారు. ఎమ్మెల్యేతో తనకు ఎలాంటి విభేదాలు లేవని చైర్మన్ రామ్ పటేల్ తెలిపారు. రాజీనామా చేయవలసి వస్తే నా వ్యక్తిగతంగా చేస్తుండొచ్చు కానీ, ఎమ్మెల్యే పట్టించుకోవడంలేదన్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. అలాంటిది ఏదైనా ఉంటే నేనే మీడియా ముందుకు వచ్చి వెల్లడిస్తానని అన్నారు. నిజానిజాలు తెలియక వార్తలు వాసే విలేకర్ల విజ్ఞతకే వదిలేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమాన్లు స్వామి, విట్టల్ గురుజి, మద్నూర్ సింగిల్విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్ ,మండల యూత్ అధ్యక్షులు అనుమంతు యాదవ్, మాజీ మండల పార్టీ అధ్యక్షులు రమేష్ ,కొండ గంగాధర్, మాజీ సర్పంచ్ సంతోష్ పటేల్, దేవిదాస్ పటేల్, మనోహర్ దేశాయ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -