Thursday, August 14, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ప్రజావాణిలో స్పందన కరువై... ఉన్నతాధికారికి ఫిర్యాదు

ప్రజావాణిలో స్పందన కరువై… ఉన్నతాధికారికి ఫిర్యాదు

- Advertisement -

నవతెలంగాణ – పెద్దకొడప్ గల్ : ప్రజావాణికి స్పందన కరవై ఉన్నతాధికారికి ఫిర్యాదు చేసిన సంఘటన కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండల తహసీల్దార్ కార్యాలయంలో జరిగింది. వివరాల్లో వెళ్ళితే…. పెద్ద కొడప్ గల్ మండల కేంద్రానికి చెందిన సర్కొండ్వార్ రమేష్ తన ఇంటి వెనకలా ఉన్న దోసపల్లి తులసిదాస్ తన ఇంట్లోనే వడ్రంగి మిషన్ పెట్టి పనులు చేస్తుండడంతో, ఆ పనిలో భాగంగా వచ్చిన శబ్దాలతో, దుమ్ము ధూళితో తమతో పాటు, కాలనీ వాసుల ఆరోగ్యాలు పాడవుతున్నాయని మర్చి23న తహసీల్దార్ కార్యాలయంలో ప్రజావాణిలో పిర్యాదు చేశారు. అయినా లాభం లేకపోవడంతో, విసుకొచ్చి మండల తహసీల్దార్ కార్యాలయ సందర్శనకు వచ్చిన సబ్ కలెక్టర్ కిరణ్మయికి గతంలో ప్రజావాణిలో పిర్యాదు చేసిన దరఖాస్తును ఇచ్చి న్యాయం చేయాలని పిర్యాదు చేశాడు. ఈ దరఖాస్తు పై సబ్ కలెక్టర్ స్పందిస్తూ దరఖాస్తుపై విచారణ జరుపుతామని తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad