నవతెలంగాణ – మల్హర్ రావు
ఉప సర్పంచ్ ల ఫోరమ్ మండల అధ్యక్షుడుగా కొయ్యుర్ గ్రామ ఉప సర్పంచ్ లకావత్ సవేందర్ ను ఏకగ్రీవంగా నియామకం చేసినట్లుగా బోట్ల కార్తీక్ తెలంగాణ రాష్ట్ర ఉప సర్పంచ్ లా ఫోరం అధ్యక్షుడు బొట్ల కార్తీక్, జిల్లా అధ్యక్షుడు గట్టు ప్రదీప్ గౌడ్ శుక్రవారం ప్రకటించారు. అదేవిధంగా ఆయనకు నియామక పత్నాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సవేందర్ మాట్లాడుతూ.. తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు, ట్రేడ్ చైర్మన్ ప్రకాస్ రెడ్డి, ఉప సర్పంచ్ల సంఘం రాష్ట్ర, జిల్లా కమిటీలకు ప్రత్యేక కృతజ్ఞతలు సవేందర్ తెలిపారు. మండలంలోని ఉప సర్పంచ్ లా సమస్యలు పరిస్కారం కొరకు కృషి చేస్తానని, ఉప సర్పంచు లా హక్కులను గుర్తించేలా పోరాడుతనని తెలిపారు. తన ఎన్నికకు సహకరించిన మండల ఉప సర్పంచ్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఉప సర్పంచ్ ల ఫోరం మండలాధ్యక్షుడుగా లకావత్ సవేందర్ ఏకగ్రీవం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



