నవతెలంగాణ – అచ్చంపేట
మండల పరిధిలోని నడింపల్లి గ్రామపంచాయతీ సర్పంచి అభ్యర్థిగా సీపీఐ(ఎం) నుంచి గుండె లక్ష్మీ దేవమ్మ శుక్రవారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా లక్ష్మీదేవమ్మ మాట్లాడుతూ.. నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా ఉద్యమాలు పోరాటాలు చేస్తున్న సీపీఐ(ఎం) మద్దతుతో పోటీ చేస్తున్నారని గ్రామస్తులు సహకరించాలన్నారు.
నడింపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామంలో 12 వార్డులలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని అన్నారు. గ్రామంలో సీసీ రోడ్లు లేని వార్డులలో సీసీ రోడ్ల నిర్మాణం చేపడతానని మంచినీటి సమస్య ఎక్కడ ఉన్నా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అండర్ డ్రైనేజీ కాలువను ఏర్పాటు చేస్తానని అన్నారు. డిసెంబర్ 17వ నాడు జరిగే పంచాయతీ ఎన్నికలలో సర్పంచి అభ్యర్థిగా గెలిపించాలని గ్రామ ప్రజలను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా నాయకులు ఎస్. మల్లేష్ , గుండె మల్లేష్, మల్లయ్య, శంకర్ తదితరులు పాల్గొన్నారు.



