Monday, December 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్లక్ష్మీదేవి కాల్వ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా

లక్ష్మీదేవి కాల్వ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా

- Advertisement -

నవతెలంగాణ-అడ్డగూడూర్: పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా ఆశీర్వదించి గెలిపిస్తే గ్రామాన్ని  అభివృద్ధి చేసి చూపిస్తానని  బిఆర్ఎస్ పార్టీ నాయకులు బలపరిచిన , మద్దతు తెలిపిన సిపిఎం నాయకులు  బిఆర్ఎస్ పార్టీ   సర్పంచ్  అభ్యర్థి గా నక్క సూరమ్మ అబ్బయ్య అన్నారు. లక్ష్మీదేవి కాలువ గ్రామంలో ఆదివారం ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ వీధుల్లో తిరుగుతూ ఓటర్ల ఇంటి వద్దకు వెళ్లి సర్పంచిగా తను ఎన్నుకోవాలని అభ్యర్థించారు. గ్రామంలోనీ ఓటర్లు ఉంగరం గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరారు. నన్ను గెలిపిస్తే గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు  దగ్గరుండి పరిష్కరిస్తానని అన్నారు. డ్రైనేజీ సమస్యలను , వీధి దీపాలు , పెన్షన్లు రాని వాళ్లకు పెన్షన్లు కూడా వచ్చేలా చేస్తామన్నారు. దెబ్బతిన్న బీటీ రోడ్లకు నిధులు మంజూరు చేయించి నూతన రోడ్లు వేయిస్తామని  హామీ ఇచ్చారు . మీ అమూల్యమైన ఓటును ఉంగరం గుర్తుకు వేసి ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బలపరిచిన ముఖ్య నాయకులు    మహిళలు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పొన్నాల వెంకటేశ్వర్లు , చిగుళ్ల ఉపేంద్ర , కొలుగూరి రాములు , బొమ్మగాని నాగయ్య , చెరుకు మధు , చిగుళ్ల వీరయ్య , కన్నెబోయిన గంగులు , గ్రామ శాఖ అధ్యక్షులు మారోజు వెంకన్న , మద్దతు తెలిపిన సిపిఎం నాయకులు ఆకుల సోమల్లయ్య , మామిండ్ల నరసయ్య , పడమటి ముత్తయ్య , పొన్నాల చంద్రకళ , బొమ్మగాని పద్మ , శ్రీను, అనిత , మహిళలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -