Sunday, November 16, 2025
E-PAPER
Homeఆటలులక్ష్యసేన్‌ పరాజయం

లక్ష్యసేన్‌ పరాజయం

- Advertisement -

జపాన్‌ మాస్టర్స్‌ సూపర్‌ 500

టోక్యో (జపాన్‌) : భారత అగ్రశ్రేణి షట్లర్‌, పారిస్‌ ఒలింపిక్స్‌ సెమీఫైనలిస్ట్‌ లక్ష్యసేన్‌ జపాన్‌ మాస్టర్స్‌ సూపర్‌ 500 టోర్నమెంట్‌లో సెమీస్‌లో పరాజయం పాలయ్యాడు. క్వార్టర్‌ఫైనల్లో వరల్డ్‌ నం.9పై విజయం సాధించిన లక్ష్యసేన్‌.. సెమీఫైనల్లో లోకల్‌ స్టార్‌, వరల్డ్‌ నం.13 కెంటా నిషిమోటోతో మూడు గేముల మ్యాచ్‌లో పోరాడి ఓడాడు. ఒక గంట 17 నిమిషాల పాటు సాగిన సెమీస్‌ సమరంలో లక్ష్యసేన్‌ 19-21, 21-14, 12-21తో నిషిమోటో చేతిలో ఓటమి చెందాడు. తొలి గేమ్‌లో లక్ష్య ముందంజ వేసినా ఆఖర్లో పుంజుకున్న నిషిమోటో పైచేయి సాధించాడు. రెండో గేమ్‌లో నెగ్గిన లక్ష్యసేన్‌ లెక్క సరి చేశాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో నిషిమోటో సూపర్‌ గేమ్‌తో రాణించాడు. లక్ష్యసేన్‌ ఆశించిన పోరాట పటిమ కనబరచలేదు. లక్ష్యసేన్‌ ఓటమితో జపాన్‌ మాస్టర్స్‌లో భారత పోరాటానికి తెర పడింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -