నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్ ఎన్నికల (Bihar Elections) ఫలితాల అనంతరం ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ (Lalu Yadav) కుటుంబంలో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కుటుంబంలో చీలికలపై లాలూ యాదవ్ (Lalu Yadav) తొలిసారి స్పందించారు. ఇది కుటుంబ అంతర్గత విషయమని.. తాను పరిష్కరిస్తానంటూ వ్యాఖ్యానించారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో లాలూ యాదవ్ సమావేశం నిర్వహించారు. పాట్నాలో జరిగిన సమావేశానికి లాలూ యాదవ్ భార్య రబ్రీ దేవి, పెద్ద కుమార్తె మిసా భారతి, జగదానంద్ సింగ్ సహా సీనియర్ ఆర్జేడీ నాయకులు హాజరయ్యారు. ఇక ఈ సమావేశంలో ఆర్జేడీ ఎల్పీ లీడర్‌గా తేజస్వీ యాదవ్‌ను ఎన్నుకున్నారు.
ఈ మీటింగ్ సందర్భంగా ఫ్యామిలీలో విభేదాల గురించి లాలూ ప్రస్తావించారు. ‘ఇది కుటుంబ అంతర్గత విషయం. కుటుంబంలోనే పరిష్కరించాలి. ఈ సమస్యను నేను పరిష్కరిస్తా’ అని వ్యాఖ్యానించారు. కాగా, ఇటీవలే జరిగిన బీహార్ ఎన్నికల్లో మహాగఠ్‌బంధన్ కూటమి 35 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది.



