ఆ అడవిలో ఒకే ఒక మామిడి చెట్టు ఉంది. అది విరగ కాయలు కాసింది. ఆ చెట్టుపైకి కొన్ని కోతి మూకలు చేరి ఇష్టానుసారంగా కాయలు తెంచి, కొన్నిటిని నేల పాలు చేసేవి. ఆ అడవికి మొత్తం అదే ఫల వృక్షం. కోతులు కిచకిచ మని అరచుకుంటూ పళ్ళు ఆరగించేవి. పాపం చెట్టు కింద ఉన్న కుంటి కోతి చెట్టు పైకి ఎక్క లేక వాటినే చూస్తూ, కింద పడిన వాటిని తినేది. అది చూసి మిగతా కోతులు ”మనం ఇక కింద పళ్ళు వేయకుండా ఉందాం. ఆ కుంటి కోతి ఏ కష్టం లేక మనం పారవేచిన పండ్లు తేరగా ఎలా తింటుందో చూడండి మన కష్టం దానికి సుఖం అది మన మాదిరి చెట్టు ఎక్కాలి పండ్లు తినాలి మరి ”అంది ఓ లావు కోతి.వారి మాటలు విన్న ఓ వద్ద కోతి ”అలా చేయవద్ధ0డి.పాపం దాని కాలికి బలమైన గాయం అయింది. అది చెట్టు ఎక్కలేదు. పండ్లు లేకపోతే అది ఆకలితో నీరసించి పోతుంది. మీరు పండ్లు వేయకపోతే నేనే వేస్తాను ”అంటే దానికి మిగతా కోతులు ”నువ్వు వేశావంటే నీ పని పడతాం ఊరికే పడి ఉండు. లేకపోతే నిన్ను గెంటేస్తాం ”అన్నాయి. లావు కోతి ముందుకొచ్చి దాని గొంతు పట్టుకుని ” ఏమైనా వేశావా నీ పని సరి ”అని గొంతు వదిలేసింది. చేసేదేమి లేక మిన్న కుండి పోయింది ఆ వద్ద కోతి గొంతు పట్టుకుని ”అబ్బా నొప్పి ”అంటూ మూలిగింది. వారం రోజుల నుంచి ఒక్క పండు కింద పడలేదు కుంటి కోతి చూసి చూసి అక్కడ ఉండలేక మరో చోటుకు వెళుతు ఉంటే ఒక పెద్ద అరటి గెల కనిపించింది. వెంటనే దాన్ని ఓ చెట్టు తొర్ర లో దాచి రోజు కొన్నిటిని తిని ఆకలి తీర్చుకునేది.
మామిడి చెట్టు మీద పండ్లు అన్నీ అయిపోయాయి. ఇక తినేకి వాటికి ఏమి దొరకలేదు. ఆకలితో నక నక లాడాయి. వద్ద కోతి అతి కష్టం మీద ఓ రాత్రి అడవిలో వెళుతుంటే, కుంటి కోతి కి కనిపించి మెల్లగా పిలిచింది.
దాన్ని చూడగానే వృద్ద కోతి కళ్ళు మెరిశాయి. అది రమ్మని పిలిచింది. వృద్ద కోతి వెళ్ళగానే అరటి పళ్ళు ఇచ్చింది. ఆకలితో ఉందేమో గబా గబా తినింది. ”మన మిత్రులు ఎలా ఉన్నారు?”అని అడిగింది. దానికి వద్ద కోతి ”ఏమి చెప్పమంటావ్, వాటికి ఆహారం లేక పస్తులు ఉంటున్నాయి. నీకు చేసిన ద్రోహం ఊరికే పోతుందా ”అంది.”అయ్యో పాపం మనం అలా ఉంటే ఎలా, కష్టాలలో ఆదుకోవాలి. పద ఈ అరటి పళ్ళు ఇద్దాం ”అంది. తెల్ల వారగానే అరటి గెల వద్ద కోతి మోసుకు పోతుంటే కింద పడిన అరటి పళ్ళను కుంటి కోతి ఏరుకుంటూ వస్తోంది. వృద్ద కోతి భుజాన అరటి గెల క నపడగానే నోరు ఊరింది ఆ కోతుల సమూహానికి.
అన్నీ బిల బిల మంటూ కిందికి దిగాయి. గెలను ముడుతుండగా ”ఆగండి ”గట్టిగా అరచింది వృద్ద కోతి.
అన్నీ బిక్కు బిక్కు మంటూ చూస్తున్నాయి. ”మీరు పళ్ళు వేయకుండా ఈ కుంటి కోతిని ఇబ్బంది పెట్టారు. కాని ఇది మాత్రం మీ మంచి కోరింది. ఆకలి తో మీరు మాడి పోకూడదు అని మంచి మనసుతో తన దగ్గర ఉన్న పళ్ళను మీకు ఇవ్వాలని నాతో చెప్పింది. మనం ఇతరులకు సహాయం చేయాలి కాని ఎవరిని కష్ట పెట్టరాదు ”అంది. దానికి మిగతా కోతులు తల దించాయి. లావు కోతి ”తప్పు అయింది ఇక ఎప్పుడు అలా చేయం ”అంది. కుంటి కోతి కల్పించుకుని ”మనం బాగుండాలి, ఒకరికొకరం సహాయం చేసుకోవాలి ” అని పళ్ళను వాటికి ఇవ్వమని వృద్ద కోతికి చెప్పింది. వృద్ద కోతి ఇవ్వగానే అవి పళ్ళను కడుపారా తిన్నాయి. అవి తింటుంటే చూసి కేరింతలు కొట్టింది కుంటి కోతి. అన్నీ కుంటి కోతికి క్షమాపణలు చెప్పాయి. అది చూసి వాటిలో వచ్చిన మార్పుకు సంతోషించింది వద్ద కోతి.
కనుమ ఎల్లారెడ్డి, 93915 23027