Thursday, December 4, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంహెచ్‌ఐఎల్‌టీపీ పేరుతో తక్కువ ధరకు భూముల అప్పగింత

హెచ్‌ఐఎల్‌టీపీ పేరుతో తక్కువ ధరకు భూముల అప్పగింత

- Advertisement -

రూ.5 లక్షల కోట్ల నష్టం కలిగేలా ప్రభుత్వ చర్యలు : ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి
మౌలాలి పారిశ్రామిక ప్రాంతంలో పర్యటన


నవతెలంగాణ-హైదరాబాద్‌ డెస్క్‌
హైదరాబాద్‌ పరిధిలోని సుమారు రూ.5 లక్షల కోట్ల భూములను ‘హైదరాబాద్‌ ఇండిస్టియల్‌ ల్యాండ్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ పాలసీ (హెచ్‌ఐఎల్‌ టీపీ) పేరుతో ప్రయివేటీకరించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్రపూరిత చర్యలు చేస్తున్నదని ఎమ్మెల్సీ, శాసనమండలిలో బీఆర్‌ఎస్‌ పక్ష నేత మధుసూదనాచారి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా మౌలాలిలోని పారిశ్రామికవాడలో బుధవారం కార్పొరేటర్‌లు, స్థానిక బీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజలతో కలిసి వారు పర్యటించారు. అనంతరం జరిగిన సమావే శంలో మధుసూదనాచారి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం పారిశ్రామిక ప్రాంతాల్లోని కోట్ల రూపాయల విలువైన భూములను తక్కువ ధరకు ప్రయివేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. సుమారు 9,300 ఎకరాల భూములను మార్కెట్‌ విలువ కంటే చాలా తక్కువ ఎస్‌ఆర్‌ఓ రేటు 30 శాతానికే రెగ్యులరైజ్‌ చేసి రాష్ట్ర ప్రజలకు రూ.5 లక్షల కోట్ల భారీ నష్టం కలిగించే కుట్ర చేస్తోందన్నారు.

పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టడానికి, శ్మశాన వాటికలు, కమ్యూనిటీ హాళ్లు, గిరిజన-దళిత గురుకుల పాఠశాలలు, లైబ్రరీలు, యూప ీహెచ్‌సీ ఆస్పత్రుల కోసం భూమి లేదని చెప్పే ప్రభుత్వం.. వేల కోట్ల విలువైన పారిశ్రామిక భూములను మాత్రం ప్రయివేటు వ్యక్తులకు కట్టబెడుతున్నదని విమర్శించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పారిశ్రామికవాడల ఏర్పాటుకు ప్రజలు నమ్మకంతో ఇచ్చిన భూములను, ప్రభుత్వం అప్పట్లో చేసిన కేటాయింపులను, వాటి అసలు ఉద్దేశాలను ఇప్పుడు పూర్తిగా విస్మరించి, రియల్‌ ఎస్టేట్‌కు మళ్లిం చడం కాంగ్రెస్‌ ప్రభుత్వ దురుద్దేశాన్ని స్పష్టం చేస్తోందని అన్నారు. ఈ కార్యక్ర మంలో బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌లు చింతల శాంతి శ్రీనివాస్‌రెడ్డి, మేకల సునీత రాముయాదవ్‌, మాజీ కార్పొరేటర్లు జగదీష్‌ గౌడ్‌, మురుగేష్‌, నాయకులు బద్దం పరశురామ్‌ రెడ్డి, రావుల అంజయ్య, జేఏసీ వెంకన్న, తోట నరేందర్‌ రెడ్డి, అనిల్‌ కిషోర్‌గౌడ్‌, మేకల రాముయాదవ్‌, జీకే హనుమంత్‌రావు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -