నవతెలంగాణ – జుక్కల్ : రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్ఘాత్మకంగా రైతులకోసం తీసుకొచ్చిన భూభారతి రెవెన్యూ సదస్సులో అసైన్డ్, పోడు రైతుల సమస్యలు పరిష్కరించాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యుడు సురేష్ గొండ ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొన్ని సంవత్సరాల నుండి ఎస్సీ, ఎస్టి, బీసీ, మైనారిటీ, పేద రైతులు అసైన్డ్ పోడు భూములను నమ్ముకొని బ్రతుకుతున్నారని అన్నారు. దాదాపు 30- 40 సంవత్సరాల నుండి ఈ భూమి తప్ప పేదవారికి వేరే భూమి అంటూ లేదు. ఈ భూములు సాగుకు యోగ్యంగా కుటుంబ సభ్యులందరూ కలిసి, ప్రతి సంవత్సరం కష్టపడి పంట పండించుకుంటున్నారని తెలిపారు. రైతులు ఈ భూమి మీద కొన్నేండ్ల నుంచి రైతు క్రాప్ లోన్, పంట రుణాలు, వివిధ బ్యాంకులలో రుణాలు తీసుకొని, పంట పెట్టుబడి పెట్టి సాగు చేస్తున్నారని అన్నారు. అయితే వీరికి ధరణి పేరుతో పట్టాలను రద్దు చేయడం చాలా దూరదృష్టకారం అని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు సురేష్ గొండ మండిపడ్డారు. ఈ భూమిని ప్రభుత్వమే ఇచ్చి, ఈ భూములలో ఇందిరా జల ప్రభ, బోర్లు, బావులు, తవ్వించినారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ అసైన్డ్ పోడు భూములలో ఉపాధి హామీ కూలీలతో, రాళ్లు రప్పలు, చిన్నచిన్న ముళ్ళు పొదలు తొలగించే కార్యక్రమం ప్రభుత్వ ఖజానా నుంచే చేశారు. ప్రస్తుతం ఈ భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో పోడు రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం భూభారతి గ్రామ రెవెన్యూ సదస్సులో అసైన్డ్, పోడు రైతుల దరఖాస్తులను తీసుకొని ప్రతి ఒక్క పేద రైతుకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అసైన్డ్ పోడు రైతులకు పాత రుణాలు మాఫీ చేసి, కొత్త రుణాలు ఇవ్వాలని, వీరికి కూడా రైతు పెట్టుబడి సాయం అందేలా చూడాలని అన్నారు. గ్రామ రెవెన్యూ సదస్సులలో పకడ్బందీగా ప్రతి ఒక్క గుంట వదలకుండా సర్వే నిర్వహించాలని, చాలా గ్రామాలలో సిఖం భూములు కబ్జాలకు గురవుతున్నాయని, దేవదాయ భూములు కొందరు కబ్జా చేస్తున్నారని తెలిపారు. ఈ భూమిపై గ్రామ సభలలో చర్చించి పరిష్కరించాలని అన్నారు. భూ సమస్యలపై స్వీకరిస్తున్న దరఖాస్తులను నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని, కొందరు రైతులు గ్రామాలలో అందుబాటులో లేక గ్రామ సభలలో సమయానికి దరఖాస్తులు ఇవ్వలేక పోయారని, అలాంటి వారి కోసం రెవెన్యూ సదస్సులు పూర్తి చేసుకున్న గ్రామాలలోని రైతులు ఇచ్చే దరఖాస్తులను స్వీకరించేందుకు మరో అవకాశం ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
అసైన్డ్, పోడు రైతుల భూ సమస్యలు పరిష్కరించాలి: సీపీఐ(ఎం)
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES