Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఐదు మండలాలో అంబెడ్కర్ భవణ నిర్మాణానికి స్థలం కెటాయించాలి

ఐదు మండలాలో అంబెడ్కర్ భవణ నిర్మాణానికి స్థలం కెటాయించాలి

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ డివిజన్ పరిధిలో గల ఐదు మండలాలకు అంబేద్కర్ భవణ నిర్మాణానికి స్థలం కెటాయించాలని లింగాల రామయ్య, మేరుగు లక్ష్మణ్ లు కాటారం సబ్ కలెక్టర్ మాయాంక్ సింగ్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా లింగాల రామయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… అంబేద్కర్ యువజన సంఘం తరుఫున జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ డివిజన్ పరిధిలో ని కాటారం, మహాదేవ్ పూర్, మల్హర్ రావు, మహాముత్తారం, పలిమెల మండలాలో అంబేద్కర్ భవణాలు లేని పరిస్థితి ని సబ్ కలెక్టర్ దృష్టి కి తీసుకు వెళ్ళామని తెలిపారు.

ప్రధానంగా భవనాల అవసరం ఎందుకంటే దళిత సమాజానికి సామాజిక, విద్యా, సాంస్కృతిక, యువజన కార్యక్రమాలకు అంబేద్కర్ భవణాలు అత్యంత కీలకమనీ అన్నారు. ఈ భవణాల ద్వారా స్థానిక యువతకు విద్య, ఉపాధి మరియు సామాజిక కార్యక్రమాలు నిర్వహించవచ్చని తెలిపారు. అన్ని మండలాల స్థానిక సంఘాలు, ప్రజాప్రతినిధులు, నాయకులు ఈ భవనాలకు మద్దతు తెలిపారని అన్నారు. ఈ ఐదు మండలాల కేంద్రంలో ఖాళీ గా ఉన్న ప్రభుత్వ భూమిని కెటాయిస్తే, భవణాల నిర్మాణం సాద్యం అవుతుందని వెల్లడించారు. తద్వారా సమాజానికి ప్రయోజనం, ప్రజామద్దతు మరియు ప్రభుత్వ భూమి వినియోగం లోకి వస్తుందని తెలిపారు. వెంటనే సబ్ కలెక్టర్ మా అభ్యరథనను దృష్టి లో పెట్టుకొని కాటారం సబ్ డివిజన్ పరిధిలో గల ఐదు మండలాల లో, అంబేద్కర్ భవణ నిర్మాణానికి మండల కేంద్రాల్లో స్థలాన్ని కెటాయించి, అనుమతి ఇవ్వాలని సబ్ కలెక్టర్ రు విజ్ఞప్తి చేశామన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad