Sunday, October 19, 2025
E-PAPER
Homeసోపతినవ్వుల్‌ పువ్వుల్‌

నవ్వుల్‌ పువ్వుల్‌

- Advertisement -

‘వెధవ’ ప్రశ్న

సెమినార్‌లో ప్రశ్నోత్తరాల సెషన్‌ ప్రారంభమైంది.
‘సమయాభావం వల్ల ప్రతి ఒక్కరికీ సమాధానం ఇవ్వడం కుదరదు. మీరు అడగాల్సినది ఓ కాగితం మీద రాసి పంపండి. వరుసగా సమాధానాలు ఇస్తాను’ అన్నాడు వక్త.
అతడంటే ఇష్టం లేని ఓ వ్యక్తి కాగితంపై ‘వెధవ’ అని రాసి పంపాడు. దానిని చూసిన వక్త.. ‘ఎవరో మహానుభావుడు.. మేటర్‌ రాయకుండా తన పేరు మాత్రమే రాసి పంపాడు’ అంటూ చమత్కరించాడు.

వెరైటీ బాత్‌రూమ్‌

భార్యతో తాగుబోతు భర్త ‘డార్లింగ్‌! ఇదేం విచిత్రం..? నేను బాత్రూమ్‌లోకి వెళ్లడానికి డోర్‌ తీయగానే లైట్‌ ఆన్‌ అయిపోయింది. లోపలికెళ్లి డోర్‌ మూసేయగానే ఆఫ్‌ అయిపోయింది’ అన్నాడు ఆశ్చర్యంగా.
‘మీ మొహం! మీరు వెళ్లింది బాత్రూమ్‌లోకి కాదు.. ఫ్రిజ్‌లోకి’ అసలు విషయం చెప్పింది భార్య.
అన్ని గిఫ్టులూ నాన్నకే..

బాగా అల్లరి చేస్తున్న పిల్లలతో తల్లి ‘ఈ రోజు నుంచి మీకు బంపర్‌ ఆఫర్‌. నా మాట విన్న వారికి మంచి గిఫ్టులు ఇస్తాను’ అంది.
ఈ మాట వినడంతో ‘అయితే.. మాకు అన్యాయమే జరుగుతుంది’ అన్నాడు కొడుకు.
‘అదెలా..?’ అడిగింది తల్లి.
‘ప్రతిరోజూ గిఫ్టు నాన్న గారికే దక్కుద్ది’ అనుమానం వ్యక్తం చేశాడు కొడుకు.

మాటల ప్రభావం

పరీక్షలో కాపీ కొట్టేందుకు తన ఆన్సర్‌ షీట్‌ను సోమేష్‌కు ఇచ్చాడు నరేష్‌.
ఇది గుర్తించిన టీచర్‌ ‘నీ ఆన్సర్‌ షీట్‌ అతడికెందుకు ఇచ్చావ్‌’ అంటూ నరేష్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది టీచర్‌.
‘మీ మాటలకు ప్రభావితమై ఇవ్వాల్సి వచ్చింది’ సమాధానమిచ్చాడు నరేష్‌.
‘నేనేం చెప్పాను ..’ విషయం అర్థంకాక అడిగింది టీచర్‌.
‘తోటి వారికి సహాయం చేసే వారే ఉత్తములు అని మీరే కదా అన్నారు…?!!.’ గుర్తు చేశాడు నరేష్‌.

అసలు విషయం

సింహాచలం : మా ఆఫీసర్‌ అందరిలా కాదు, ప్రతి పేపరు ఒకటికి పదిసార్లు చదివితే కాని సంతకం పెట్టరు తెలుసా?
సుమన్‌ : అయితే ఏ విషయమైనా క్షుణ్ణంగా పరిశీలించి కాని సంతకం చేయరన్నమాట!
సింహాచలం : పరిశీలించడం కాదులే, అన్నిసార్లు చదివితే తప్ప అసలు విషయం ఆయనకి అర్ధం కాదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -