గొడవ పడకు
భార్య: ఏమండీ.. నేను మీ మనసులో ఎప్పటికీ ఉండిపోతాను
భర్త: ఉంటే ఉన్నావు గానీ, అక్కడ వేరే ఆడవాళ్లు కూడా ఉన్నారు, వాళ్లతో గొడవపడకు.
పులిహోర
తమ్ముడు : అక్కయ్య ఏంటీ ఈరోజు బావగారు చాలా కోపంగా ఉన్నారు?
అక్క : ఏమో తమ్ముడూ మీ బావ ఈరోజు పండగని ఏదైనా పిండి వంట చేయమన్నారు. నేను నిమ్మకాయ పిండి, పులిహోర చేశాను. ఆయన చెప్పింది చేసినా.. ఎందుకు కోపంగా ఉన్నారో నాకైతే అర్థం కావడం లేదు.
డాక్టర్ సర్టిఫికెట్
బాస్: ఒంట్లో బాగాలేదని పది రోజులు సిక్ లీవ్ అని పెట్టావ్, డాక్టర్ సర్టిఫికెట్ తెమ్మంటే తేవడం లేదు ఎందుకు?
ఉద్యోగి: నేను ఆ డాక్టర్ని ఎంత అడిగినా, అది ఆయన కష్టపడి సంపాదించుకున్న సర్టిఫికెట్ అని, ఇవ్వను పొమ్మంటున్నాడు సార్.
ఒక్కసారి చదువుతా
భర్త : రేపు నీ పుట్టిన రోజుకి ఏం కావాలో కోరుకో డార్లింగ్.
భార్య : ఒక చిరుత పులిని వేటాడి తెండి. పెంచుకుంటా.
భర్త : అందేం కోరిక వేరేది కోరుకో.
భార్య : అయితే మీకు వచ్చిన వాట్సప్ మెసేజ్‌లన్నీ ఒకసారి చదువుతా.
భర్త : సర్లే పడుకో. రేపు ఉదయాన్నే అడవికి వెళ్తా చిరుత కోసం.
ఇంకా రాలేదు
కానిస్టేబుల్ : సార్, నిన్న రాత్రి జైల్లో ఖైదీలంతా కలిసి రామాయణం నాటకం వేశారు.
జైలర్ : మంచిదేగా. దానికి నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావ్?
కానిస్టేబుల్ : ఎందుకంటే.. హనుమంతుడు పాత్ర వేసిన ఖైదీ సంజీవని తెస్తానని రాత్రి వెళ్ళి ఇంత వరకు రాలేదు సార్……
ఉప్పు మసాలా కర్రీ
భర్త: ఛీ.. ఏంటీ ఈరోజు కూరలో ఉప్పు మరీ ఎక్కువైంది?
భార్య: లేదండీ.. ఈరోజు నేను చేసిందే ఉప్పు మసాలా కర్రీ.
డాక్టర్ సర్టిఫికెట్
బాస్: ఒంట్లో బాగాలేదని పది రోజులు సిక్ లీవ్ అని పెట్టావ్, డాక్టర్ సర్టిఫికెట్ తెమ్మంటే తేవడం లేదు ఎందుకు?
ఉద్యోగి: నేను ఆ డాక్టర్ని ఎంత అడిగినా, అది ఆయన కష్టపడి సంపాదించుకున్న సర్టిఫికెట్ అని, ఇవ్వను పొమ్మంటున్నాడు సార్.



