గొడవ పడకు
భార్య: ఏమండీ.. నేను మీ మనసులో ఎప్పటికీ ఉండిపోతాను
భర్త: ఉంటే ఉన్నావు గానీ, అక్కడ వేరే ఆడవాళ్లు కూడా ఉన్నారు, వాళ్లతో గొడవపడకు.
అలాగే వుండాలంటే…
సురేష్: నా భార్య ఇన్‌ఫీరియారిటీతో బాధ పడుతోంది డాక్టర్.
డాక్టర్: నేను దాన్ని సరిచేయాలా?
సురేష్: వద్దు వద్దు… అది అలాగే ఉండటానికి ఏం చేయాలో సలహా చెప్పండి చాలు.
భవిష్యత్తులో…
ఒక సినీనటిని ఇంటర్వ్యూ చేస్తున్న విలేకరి మధ్యలో ఇలా అడిగాడు- ”మేడమ్ మీరు భవిష్యత్తులో ఏం చేద్దామనుకుంటున్నారు?”
”నేను నా జీవితాన్ని కళామతల్లికే అంకితం చేద్దామనుకుంటున్నాను”
”అదెలా సాధ్యం మేడమ్! వయసు పెరిగేకొద్దీ అవకాశాలుండవు కదా?”
”స్లిమ్‌గా, గ్లామర్‌గా వున్నంతకాలం సినిమాల్లో నటిస్తాను. ఆ తర్వాత కాస్త లావు అయితే టీవీ సీరియల్స్‌లో నటిస్తాను” అని సెలవిచ్చారామె.
ఆలస్యం
రోషన్ స్కూలుకు పదిహేను నిమిషాలు ఆల్యసంగా వచ్చాడు. టీచర్ కోపంగా లేటు ఎందుకయిందని అడిగాడు.
రోషన్: టీచర్ నేను ఒక అందమైన కల కన్నాను. దాంట్లో విమానంలో యూరప్ కంట్రీస్ అన్నీ చూశాను. తిరిగి మన ఇండియాలో విమానం దిగి ఇంటికి వెళ్ళి తయారై వచ్చేసరికి లేటు అయింది.
ఇంకో అయిదు నిమిషాలకు ప్రకాష్ స్కూలుకి వచ్చాడు.
”నీకెందుకు లేటు అయిందిరా” అని అడిగాడు టీచర్.
ప్రకాష్: నేను విమానాశ్రయానికి వెళ్ళాను, రోషన్‌ని రిసీవ్ చేసుకోడానికి.
క్యూ ఎందుకంటే…?
ఓ ఇంటి ముందు పెద్ద గుంపు కనిపిస్తే సుబ్బారావు ఆగాడు. విషయమేంటని వాకబు చేస్తే, ఆ ఇంటి అల్లుడు పెంచుతున్న కుక్క కరవడం వల్ల అత్తగారు పోయారని తెలిసింది.
”చాలా మంచావిడలా ఉంది. చూడ్డానికి ఇంతమంది వచ్చారు” అన్నాడు సుబ్బారావు.
”అబ్బే అలాంటిదేమీ లేదు. కుక్కని అమ్ముతారేమోనని వాకబు చేయడానికి వచ్చినవాళ్ళు వీళ్ళంతా” అని చెప్పారెవరో.


