Tuesday, July 8, 2025
E-PAPER
Homeజాతీయండ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కార్‌తో బీహార్‌లో శాంతిభ‌ద్ర‌త‌లు న‌శించాయి: ఖ‌ర్గే

డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కార్‌తో బీహార్‌లో శాంతిభ‌ద్ర‌త‌లు న‌శించాయి: ఖ‌ర్గే

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: బీహార్‌లో రోజురోజుకు హింస పెరిగిపోతుంద‌ని, శాంతి భ‌ద్ర‌త‌ల‌ను అదుపు చేయ‌డంలో ఎన్డీయే కూట‌మి భాగ‌స్వామి ప‌క్షం నితిష్ కుమార్ ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని కాంగ్రెస్ అధ్య‌క్షులు మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే విమ‌ర్శించారు. రాష్ట్రంలో నేరాలు పెరిగిపోయి, శాంతిభ‌ద్ర‌త‌లు న‌శించిపోతున్నాయని ఆయ‌న ఎక్స్ వేదిక‌గా ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ” రాష్ట్రంలో వ్యాపారవేత్తల హత్యలు. అవకాశవాద డబుల్ ఇంజిన్ ప్రభుత్వం బీహార్‌లో శాంతిభద్రతలను నాశనం చేస్తుంది. గత 6 నెలల్లో ఎనిమిది మంది వ్యాపారవేత్తలు చంపబడ్డారు, 5 సార్లు పోలీసుల చేత హింసించ‌బ‌డ్డారు, నిన్ననే, మూఢనమ్మకాల కారణంగా ఒకే కుటుంబంలోని ఐదుగురు సభ్యులు చంపబడ్డారు. అమాయక పిల్లలను కూడా వదిలిపెట్టలేదు!” అని ఆయ‌న Xలో పేర్కొన్నారు. బీహార్‌లోని పూర్ణియాలో ఒక కుటుంబంలోని ఐదుగురు సభ్యులను మూఢనమ్మకాల కారణంగా సజీవ దహనం చేశార‌ని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -