నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీలోని కల్కాజీ ఆలయంలోని సేవకుడు దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనపై ఆ రాష్ట్ర మాజీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ అధికార బిజెపి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో హత్యలు జరుగుతున్నా బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. అసలు ఢిల్లీలో ఎవరైనా సురక్షితంగా ఉన్నారా? అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఆలయంలో సేవకుడిని హత్య చేసేముందు ఆ దుర్మార్గుల చేతుల వణకలేదా? అని ఆయన ప్రశ్నించారు. ఇది శాంతి భద్రతల వైఫల్యం కాకపోతే మరేమటి అని ఆయన ఎక్స్ పోస్టులో బిజెపి ప్రభుత్వాన్ని నిలదీశారు. బీజేపీ నాలుగు ఇంజన్లు ఢిల్లీని ఇంతటి స్థితికి తీసుకువచ్చాయి. ఇప్పుడు దేవాలయాల్లో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీలో ఎవరైనా సురక్షితంగా ఉన్నారా? లేదా అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఈ సేవకుడి పేరు యోగేంద్ర సింగ్.
కాగా, ఢిల్లీలో పరిస్థితి రోజురోజుకీ దిగజారుతోంది అని ఆప్ ఢిల్లీ అధ్యక్షుడు సౌరభ్ భరద్వాజ్ అన్నారు. రాష్ట్రంలోని పోలీసులు రాజకీయ పనులతో బీజీగా ఉన్నారు. పోలీసులు చట్టాలను గౌరవించే ప్రజలను బెదిరిస్తారు. దొంగలు, గూండాలు, గ్యాంగ్‌స్టర్లకు పోలీసులంటే అస్సలు భయం ఉండదు. డబ్బుతోనే ప్రతిదాన్ని నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నారు.