Tuesday, October 21, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంలారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్ ఉగ్రవాద సంస్థ: కెనడా

లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్ ఉగ్రవాద సంస్థ: కెనడా

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ను కెనడా ప్రభుత్వం ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఒక వర్గానికి చెందిన ప్రజలు గణనీయంగా జీవిస్తున్న ప్రాంతాల్లో భయానక వాతావరణం సృష్టిస్తున్నదని, బెదిరింపులకు పాల్పడుతున్నదని కెనడా పేర్కొన్నది. ‘హింస, ఉగ్రవాద చర్యలకు కెనడాలో స్థానం లేదు.ఒక వర్గాన్ని టార్గెట్‌ చేస్తూ భయానక వాతావరణం, బెదిరింపులకు పాల్పడతామంటే ఊరుకునేది లేదు. క్రిమినల్‌ కోడ్‌ ప్రకారం లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ను ఉగ్రవాద సంస్థల జాబితాలో ప్రజా భద్రతా శాఖ చేర్చింది’ అంటూ పేర్కొన్నది. కెనడాలో ఆ గ్యాంగ్‌ ప్రభావం స్పష్టంగా కనపడుతున్నదని తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -