– సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ నివాళి
– నేడు హైదరాబాద్‌లో అంత్యక్రియలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అచ్యుత రామయ్య అల్లుడు,పుట్టగుంట సుబ్బారావు కుమారుడు ప్రముఖ న్యాయవాది సుందరయ్య (71) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. ఆయన భౌతిక కాయాన్ని శుక్రవారం ఉదయం ఏడు నుంచి పది గంటల వరకు వారి స్వగృహం హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఉన్న దత్తసాయి అపార్ట్‌మెంట్ వద్ద ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తర్వాత బన్సీలాల్‌పేట్‌లోని శ్మశాన వాటికలో అంత్యక్రియలను నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. సుందరయ్య మరణవార్త తెలియగానే సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన మరణం పట్ల సంతాపం, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
న్యాయవాది సుందరయ్య కన్నుమూత
- Advertisement -
- Advertisement -



