- Advertisement -
నవతెలంగాణ – మిర్యాలగూడ
నిర్మల్ న్యాయస్థానం పరిసరాల్లో న్యాయవాది పి.అనిల్ కుమార్ వాహనాన్ని పోలీసులు ధ్వంసం చేసిన ఘటనను మిర్యాలగూడ బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించారు. విధులకు బహిష్కరించారు.ఈ చర్య న్యాయవృత్తి, ఆత్మగౌరవం, స్వాతంత్ర్యం పట్ల నేరుగా చేసిన దాడిగా భావించి. బాధ్యులైన పోలీస్ సిబ్బందిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో ప్రెసిడెంట్ ఎత్తి సత్యనారాయణ, సెక్రటరీ భూపతి రెడ్డి, భవాని, ఆర్ సైదులు, కే. వెంకన్న, ఇబ్రహీం, పరమేష్, కిరణ్ రెడ్డి, కుమార్ రెడ్డి, గూడూరు శ్రీనివాస్, ఉమా శంకర్, న్యాయవాదులు పాల్గొన్నారు.
- Advertisement -



