కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో సంగీతం
నవతెలంగాణ- రాజన్న సిరిసిల్ల
రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్న నేపద్యంలో కాంగ్రెస్ కార్యకర్తలంతా ఎన్నికలకు సిద్ధం కావాలని సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిల్ లో మెజారిటీ స్థానాలు గెలుచుకునేలా క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, నాయకులు పనిచేయాలనీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ అన్నారు. సిరిసిల్లలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. సిరిసిల్ల పట్టణంలోని 39 వార్డులలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గూర్చి క్షేత్రస్థాయిలో ప్రజలందరికీ తెలిసేలా ప్రచారం నిర్వహించాలన్నారు.
39 వార్డులలో కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తలు, నాయకులు క్షేత్రస్థాయిలో కష్టపడి పార్టీ కోసం పనిచేసి చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునే విధంగా కార్యాచరణ రూపొందించుకోవాలనీ ఆయన పేర్కొన్నారు. వార్డుల వారీగా రిజర్వేషన్ల అంశం, సామాజిక వర్గాల పరిశీలన, స్థానికంగా ఉన్న పరిస్థితులను అంచనా వేసుకుంటూ గెలుపు దిశగా అడుగులు వేయాలనీ, కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలలో మంచి విశ్వాసం ఉన్నది, ఎక్కడ కూడా తగ్గకుండా ప్రచారంలో దూసుకుపోవాలి.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో ఇచ్చిన హామీల ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ వెళుతున్నాం.. మేనిఫెస్టోలో లేని అంశాలను కూడా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజా పాలనలో అమలు చేస్తున్నామన్నారు.
వార్డులలో నేటి నుంచి ప్రచారం ప్రారంభించాలి.. కాంగ్రెస్ పార్టీ ఆయా వార్డులలో చేసిన అభివృద్ధి పనులను చూపిస్తూ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన గూర్చి వివరించాలి.. అభ్యర్థుల ఎంపికలో గెలుపు అవకాశాలు ఉన్న అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది.. ఎలాంటి బేసిజాలు లేకుండా అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ జెండా కింద పనిచేయాలి. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సూర దేవరాజు, మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఆకునూరి బాలరాజు, సీనియర్ నాయకులు వైద్య శివప్రసాద్, మాజీ కౌన్సిలర్లు, వార్డ్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



