నవతెలంగాణ-కమ్మర్ పల్లి
కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షునిగా నియామకమైన కాటిపల్లి నాగేష్ రెడ్డినీ బుధవారం కమ్మర్ పల్లి మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. మోర్తాడ్ లోని బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డికి చెందిన ప్రజానిలయంలో కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు కాటిపల్లి నాగేష్ రెడ్డినీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంకేట రవి, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు పాలెపు నర్సయ్య మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నాగేష్ రెడ్డిని శాలువ కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు పడిగెల ప్రవీణ్, యూత్ కాంగ్రెస్ నాయకులు ఆల్గోట్ రంజిత్, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా అధ్యక్షుడిని మర్యాదపూర్వకంగా కలిసిన నాయకులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


