Sunday, July 6, 2025
E-PAPER
Homeమహబూబ్ నగర్ఎమ్మెల్యే వంశీకృష్ణ నివాళ నేతల అశ్రునివాళులు

ఎమ్మెల్యే వంశీకృష్ణ నివాళ నేతల అశ్రునివాళులు

- Advertisement -

నవతెలంగాణ–ఉప్పునుంతల
ఉప్పునుంతల మండల కేంద్రానికి చెందిన ప్రముఖులు, నలుగురిలో ముద్దుబిడ్డగా పేరొందిన కొత్త చిన్న జంగి రెడ్డి ఆదివారం అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ స్వయంగా స్వగ్రామానికి చేరుకుని, మృతదేహానికి పూలమాల వేసి అశ్రునివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి మద్దతుగా నిలిచారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు అనంతరెడ్డి, మాజీ ఎంపీపీ నరసింహారెడ్డి, అనుష ప్రాజెక్ట్ ప్రైవేట్ అధినేత జలంధర్ రెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జంగి రెడ్డి మృతి పట్ల వారు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ఆయన సేవలను స్మరించుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -