నవతెలంగాణ – కల్వకుర్తి టౌన్
వెల్దండ మండలం లింగారెడ్డి పల్లి గ్రామ మాజీ సర్పంచ్ సీనియర్ జర్నలిస్టు సోమయ్య మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎస్సీ, ఎస్టీ, మానిటరింగ్ విజిలెన్స్ నాగర్ కర్నూల్ జిల్లా కమిటీ నెంబర్ జిల్లెల్ల రాములు గ్రామానికి వెళ్లి బుధవారం సోమయ్య భౌతికకాయానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ఆయన తెలిపారు. సోమయ్యతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని అందరితో పంచుకున్నారు. సోమయ్య తెలివైన వ్యక్తి అని అందరితో కలిసిమెలిసి ఉండేవాడని, ఆయన మృతి చెందడం ఎంతో బాధాకరమని కన్నీటి పర్యవంతమవుతున్న కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చారు. సోమయ్య కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పడకంటి వెంకటేష్, దున్న సురేష్, తదితరులు పల్గొన్నారు.
సీనియర్ జర్నలిస్టు మాజీ సర్పంచ్ భౌతికకాయానికి నివాళులర్పించిన నాయకులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



