సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు రాగిరెడ్డి మంగారెడ్డి
నవతెలంగాణ – మిర్యాలగూడ
నిత్యం ప్రజలకు అందుబాటు నుండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేసే నాయకులను సర్పంచ్ ఎన్నికల్లో గెలిపించాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు రాగిరెడ్డి మంగారెడ్డి కోరారు. శుక్రవారం రాత్రి మండలంలోని ఆలగడప గ్రామంలో సీపీఐ(ఎం) బలపరిచిన అభ్యర్థి ఆలేటి బిందు గెలుపు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..చదువుకున్న యువకులు విద్యావంతులు యువకులకు ప్రోత్సహించాలని సూచించారు.
ఇంజనీరింగ్ చదివిన విద్యార్థి సమాజసేవ కోసం ఆలగడప సర్పంచిగా పోటీ చేస్తుందని ప్రజలు ఆశీర్వదించి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆలేటి బిందు గెలిస్తే గ్రామ అభివృద్ధితోపాటు సంక్షేమ పథకాలు అమలు అవుతాయన్నారు. ప్రజల కోసం పనిచేసే నాయకులను ఈ ఎన్నికలో గెలిపించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు పట్టేo రామచంద్రయ్య, నాగేందర్ వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.



