- Advertisement -
నవతెలంగాణ – అశ్వారావుపేట
విద్యార్ధుల్లో అభ్యసనా సామర్ధ్యాలను మెరుగు పరచాలని కుడుములపాడు ఎంపీపీ ఎస్ ఉపాధ్యాయులకు ఎంఈఓ ప్రసాదరావు ఆదేశించారు. సోమవారం ఆయన పలు పాఠశాలలను సందర్శించి సాదారణ తనిఖీలు చేసారు.ఈ సందర్భంగా కుడుములపాడు పాఠశాలలో విద్యార్ధులను పలు పాఠ్యాంశాలను అడిగారు. విద్యార్ధులు సరైన సమాధానాలు ఇవ్వలేకపోయారు. దీంతో ఉపాధ్యాయులను ఆయన మందలించాడు. దురద పాడు, గాడ్రాల, నందిపాడు, పాఠశాలను సందర్శించారు. ఈ కార్యక్రమాల్లో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కట్టా మధు, వెంకట క్రిష్ణ, క్రిష్ణా రావు, సీఆర్పీ మాలోత్ రామారావులు పాల్గొన్నారు.
- Advertisement -