Tuesday, July 29, 2025
E-PAPER
Homeకరీంనగర్భార్య, పిల్లలను వదిలి ట్రాన్స్ జెండర్ తో సహజీవనం

భార్య, పిల్లలను వదిలి ట్రాన్స్ జెండర్ తో సహజీవనం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : జగిత్యాలలో వింతైన ఘటన చోటుచేసుకుంది. భార్య ఇద్దరు పిల్లల ఉన్న ఓ భర్త వాళ్ళని వదిలేసి ఏకంగా ట్రాన్స్ జెండర్‌తో సహజీవనం చేస్తున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లాకి చెందిన బింగి రాజశేఖర్‌కు, పెంబట్ల గ్రామానికి చెందిన లాస్యతో 2014లో వివాహమైంది. విరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే గత కొంత కాలంగా రాజశేఖర్, హైదరాబాద్‌కు చెందిన ట్రాన్స్ జెండర్‌ దీపుతో సన్నిహిత సంబంధం ఏర్పరచుకున్నాడు. ఈ క్రమంలో భార్య లాస్యను వదిలి, దీపుతో సహజీవనం ప్రారంభించాడు. ఈ విషయం తెలిసిన రాజశేఖర్ భార్య లాస్య, మానసికంగా తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతోంది. లాస్య ఆస్పత్రిలో ఉన్నప్పటికీ రాజశేఖర్ ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన అత్తమామలు అతని కోసం వెతకడంతో అయన బండారం బయటపడింది. ఈ క్రమంలో ట్రాన్స్ జెండర్ దీపుతో కలిసి ఉన్న రాజశేఖర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో పోలీసులు ఇద్దరిని స్టేషన్ కు తరలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -